గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ తాము తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించారు. సరోగసి విధానం ద్వారా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్ ని ప్రియాంక చోప్రా, జోనస్ ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబంపై దృష్టి సారించిన ఇలాంటి సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నామని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఈ గుడ్ న్యూస్ ను చెప్పింది. అయితే తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ ను 2018లో ప్రియాంక పెళ్లి చేసుకుంది. సినీ అభిమానులకు, పీసీ ఫ్యాన్స్ కు ఇది ఏమాత్రం ఊహించని సర్ ప్రైజ్.