ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డీజే టిల్లు' సినిమా నుంచి 'పట్టాసు పిల్లా .. పట్టాసు పిల్లా' సాంగ్ ను రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 01:22 PM

 'పట్టాసు పిల్లా  .. పట్టాసు పిల్లా' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ .. నేహాశెట్టి జంటగా 'డీజే టిల్లు' సినిమా రూపొందింది. సితార - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'పట్టాసు పిల్లా  .. పట్టాసు పిల్లా' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరించారు. లవ్ .. రొమాన్స్ ను ప్రధానంగా చేసుకుని సాగే పాట ఇది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, సంగీత దర్శకుడు అనిరుధ్ ఆలపించాడు. సంగీత సాహిత్యాలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. రొమాంటిక్ సీన్స్ కూడా రొటీన్ గానే కనిపిస్తాయి. 'ఆరెంజ్' .. 'గుంటూరు  టాకీస్' .. 'కల్కి' సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించిన సిద్ధు, ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా మార్కులు కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. బ్రహ్మాజీ .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa