ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతా ఓటీటీ మయం...ఈ వారంలో విడుదలయ్యే చిత్రాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 01:25 PM

కరోనా నేపథ్యంలో సినిమా రంగానికి భారీ అండ అందిస్తున్నది ఓటీటీయేనని చెప్పవచ్చు. కరోనా నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ విడుదల వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి వారం డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో విడుదలవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. ఆది పినిశెట్టి, జగపతిబాబు, కీర్తి సురేశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గుడ్ లక్ సఖి' చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోంది. నగేశ్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వాస్తవానికి గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ 18' సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న విడుదల అవుతుంది. ఈ చిత్రంలో ఆర్య, పృథ్వీరాజ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ హీరోగా నటించిన 'సామాన్యుడు' చిత్రం కూడా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతీ నటించింది. శరవణన్ దర్శకత్వం వహించాడు.  వీటితో పాటు గోర్ మాటి (జనవరి 26), దెయ్యంతో సహజీవనం (జనవరి 28), క్షుద్రశక్తుల మంత్రగత్తెలు (జనవరి 29)న విడుదల కానున్నాయి.  ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న చిత్రం: శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అర్జున ఫల్గుణ' చిత్రం డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆహా వేదికగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన అమృతా అయ్యర్ నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa