ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతడే ఓ‌ సంగీతం..మరో సంగీతం దేనికీ...సిద్ శ్రీరామ్ ను ఆకాశనెత్తిన అల్లు అర్జున్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 11:08 PM

ప్రముఖుల నుంచి ప్రశంసలే వస్తు...ఆ కిక్కే వేరప్ప. అలాంటి ప్రశంసనే గాయకుడు సిద్ శ్రీరామ్ అందుకొన్నారు. పుష్ప చిత్రం తిరుగులేని హిట్ కావడంతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాయిగా సేదదీరుతున్నాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఆసక్తికర అంశాన్ని పంచుకున్నాడు. ప్రముఖ యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ను ఆకాశానికెత్తేశాడు. "నాకు లభించిన విరామ సమయంలో ఈ విషయం రాయాలనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా సోదరుడు సిద్ శ్రీరామ్ స్టేజిపై 'శ్రీవల్లి' పాట పాడుతున్నాడు. సంగీత వాద్య సహకారం లేకుండానే పాట మొదలుపెట్టాడు. సిద్ గొంతులో పాట ఊపందుకోవడంతో ఇక సంగీతం కూడా మొదలవుతుందిలే అని ఎదురుచూస్తున్నాను. కానీ ఎంతకీ సంగీతం వాద్యాలు వినిపించలేదు సరికదా, అవేవీ లేకుండానే సిద్ పాడుతున్నాడు. నాకు మతిపోయింది. నిజంగా ఎంతో అద్భుతంగా పాడాడు. అతడు పాడుతుంటే సంగీతం అవసరంలేదు... అతడే ఓ సంగీతం అని నాకప్పుడు అనిపించింది" అంటూ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa