ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప క్రేజ్ ...హిందీలో అల్లు అర్జున్ మరో సినిమా...పాత్రదార్లు మాత్రం వేరు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 11:35 PM

పుష్ప సినిమా క్రేజ్ హిందీలోనూ ఎంతో ఊపునిచ్చింది. అల్లు అర్జున్ గతంలో నటించిన దువ్వాడ జగన్నాథం హిందీలో రీమేక్ అవుతోందటా. అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన హిట్ ఇచ్చిన సినిమాలలో 'దువ్వాడ జగన్నాథం' ఒకటిగా కనిపిస్తుంది. 2017లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. అల్లు అర్జున్ జోడీగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు ఒక వార్త బలంగా వినిపిస్తోంది. తెలుగులో ఈ సినిమాకి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన హరీశ్ శంకర్ - దిల్ రాజు, హిందీ రీమేక్ ను కూడా కలిసే చేయనున్నారట. ఈ సినిమాతోనే హరీశ్ శంకర్ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి రంగంలోకి దిగుతున్నారట. ఓ యువ కథానాయకుడు ఇందులో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa