ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెగ్యులర్ షుటింగ్ దిశగా బాలయ్య: అంతా రెడీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 02:08 PM

అఖండ సక్సెస్ తో దూకుడు మీదున్న బాలయ్య తన తుదుపరి చిత్రాలపై ఆసక్తితో ముందుడుగు వేస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. ఓటీటీ నుంచి కూడా ఈ సినిమా అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో .. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా రెంగ్యులర్ షూటింగుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. వచ్చేనెల 16వ తేదీన ఫస్టు షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. బాలకృష్ణతో పాటు ముఖ్యమైన పాత్రధారులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. అక్కడి సాగునీటి సమస్య ప్రధానంగా కథ కొనసాగుతుందని చెబుతున్నారు.  ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన సరసన ఒక కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకున్నారు. ఇక విలన్ పాత్రకి గాను దునియా విజయ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ భారీ హిట్లుగా నిలిచాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa