ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 02:15 PM

నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత కొంత మానసిక వేదనకు గురైంది. తాజా పరిస్థితుల నుంచి బయట పడాలని తన స్నేహితు రాలు శిల్పారెడ్డితో కలిసి రిషీకేష్ యాత్రకు వెళ్లడం.. అక్కడి పుణ్యక్షేత్రాల్లో విహరించి ప్రత్యేక పూజాలు చేసి హైదరాబాద్ తిరిగి వచ్చిన సామ్ వెంటనే `పుష్ప` చిత్రంలోని ప్రత్యేక గీతంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమా కోసం సమంత చేసిన తొలి ఐటమ్ సాంగ్ `ఊ.. అంటావా మవా.. ఊహూ అంటావా..`.. ఈ పాట నెట్టింట ఏ స్థాయిలో వైరల్ గా మారిందో తెలిసిందే.దేవి సంగీతం అందించిన ఈ పాటకు వరల్డ్ మొత్తం ఊగిపోతోంది. సామ్ హుక్ స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన ఈ పాట `పుష్ప` చిత్రానికి వన్ ఆఫ్ ద హైలైట్ లలో ఒకటిగా నిలిచింది. ఈ పాటకు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయి ఈ పాటని రీక్రియేట్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. బుల్లితెర స్టార్ లు అషురెడ్డి విష్ణు ప్రియ రష్మీ గౌతమ్ ఇప్పటికే ఈ పాటని రీ క్రియేట్ చేసి నెట్టింట వైరల్ అయ్యారు.


 


అయితే తాజాగ ఈ పాటపై నటి ప్రియమణి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తొలిసారి ఐటమ్ సాంగ్ చేసిన సమంత ఈ పాటలో మరింత హాట్ గా కనిపించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో సామ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ పాటపై నటి ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పాటపై స్పందించిన ప్రియమణి .. హీరోయిన్ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసింది.


 


`పుష్ప` సినిమాలోని `ఊ అంటావా ఉహూ అంటావా...`ఐటెం సాంగ్ లో సమంత హాట్ గా కనిపిస్తూ అందరి మనసులు దోచేసిందని ప్రియమణి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఐటమ్ సాంగ్ లో సమంత చాలా హాట్ గా వుందని తన భర్త తన భర్త కూడా చెప్పాడని తెలిపింది. సమంత ఇంత వరకు ఇలాంటి పాటలో నటించలేదని తెలిపిన ప్రియమణి .. సమంత నిర్ణయానికి అభినందనలు తెలిపింది. అంతే కాకుండా సినిమాల్లో హీరోయిన్ లు కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాదని సమంత నిరూపాంచిందని ప్రశంసల వర్షం కురిపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa