రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత దర్శకత్వం వహించిన చిత్రం 'శేఖర్'. ఈ చిత్రానికి రాజశేఖర్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రంలో ఆయన కూతురు శివాత్మిక ఆయన కూతురిగా నటిస్తున్నారు. ఈ నెల 4న రాజశేఖర్ పుట్టినరోజు ఈ సందర్భంగా సినిమాను విడుదల చేయాలనుకున్న కానీ చేయడం కుదరలేదు.
అందుకే ఆ రోజు ఉదయం 10 గంటలకు సినిమాలోని సెకండ్ సింగిల్‌ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కాసేపటి క్రితం అధికారికంగా విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆత్మీయరాజన్ .. ముస్కాన్ కథానాయికలుగా కనిపించనున్నారు. కొంతకాలం క్రితం మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' చిత్రానికి ఇది రీమేక్. జోజు జార్జ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పద్మకుమార్ దర్శకత్వం వహించారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారంగా కథ సాగుతుంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa