అర్జున్ రెడ్డి మరియు గీతా గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలతో తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించి, ఈ సంవత్సరం లైగర్ భారీ విడుదల కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ థమ్స్ అప్ తో డీప్ యాక్షన్ టెరిటరీలోకి అడుగుపెట్టాడు. ఇకపై థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ తర్వాత టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు మాత్రమే అవకాశం దక్కింది. ఇది మార్కెట్ పరంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రౌడీ స్టార్ బ్రాండింగ్ చేస్తుండటంతో తమ ప్రాడక్ట్ మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని ఈ కంపెనీ భావిస్తోంది. థమ్స్ అప్ కు విజయ్ బ్రాండింగ్ చేస్తున్నారనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూఫాన్, రౌడీ ఫర్ థండర్ వంటి యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ యాడ్ మంగళవారం నుండి అఫీషియల్ గా సోషల్ మీడియా,టీవీలల్లో ప్రసారం కాబోతుంది.
ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “థమ్స్ అప్కి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నేను పెరుగుతున్నప్పుడు, ఇది ఎల్లప్పుడూ నా గో-టు పానీయం. వేడి వేసవిలో, రోజంతా ఆడుకోండి, థమ్స్ అప్ తాగండి, రిఫ్రెష్ చేయండి... థమ్స్ అప్ యొక్క రుచి అసమానమైనది మరియు బిర్యానీతో ఇది సూపర్ గా ఉంటుంది అని విజయ్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa