యాంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ - యంగ్ బ్యూటీ నేహాశెట్టి హీరో- హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'డీజే టిల్లు'.'అట్లుంటది మనతోని' అనేది ట్యాగ్‌లైన్. యూత్ ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. యూత్ ని ఆకట్టుకున్న టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మేకర్స్ ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు ఎంతగానో అలరిస్తోంది.
పక్కా హైదరాబాదీ యాసతో విలక్షణమైన పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ అలరించాడు. నేహా శెట్టి మరింత గ్లామర్‌గా కనిపించింది. సిద్ధూ, నేహాల మధ్య లిప్ లాక్ ముద్దులు - రొమాంటిక్ సన్నివేశాలు.. సిద్ధూ రాసిన డైలాగ్స్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం ఖాయం. ప్రిన్స్ సెసిల్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ - కిరీటి ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల - రామ్ మిరియమ్ సంగీతం అందించగా.. ఎస్ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.
సిద్ధు జొన్నలగడ్డలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ-స్క్రీన్‌ప్లే కూడా రాశారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింహు సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. పిడివి ప్రసాద్ సమర్పణలో ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ ని ఆకట్టుకునే లవ్-ఫన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ''డీజే టిల్'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa