హిందీలో ఫేమస్ సీరియల్స్ లో 'నాగిని' ఫ్రాంచైజీ ఒకటి. 2015లో 'నాగిని' సీరియల్ మొదలైంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ధారా వాహిక ఆరో భాగం త్వరలో ప్రసారం కానుంది. వసంత పంచమి నుంచి దీనిని ప్రేక్షకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. బిగ్ బాస్-15 విజేత తేజస్వి ప్రకాష్ ఈసారి నాగిని పాత్రలో కనిపించబోతున్నారు. బయోలాజికల్ వార్ నేపథ్య కథాంశంతో లేటెస్ట్ నాగినిని తీసుకొస్తున్నారు. ఈ సీజన్ కోస ఏకంగా రూ. 130కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారట నిర్మాత ఏక్తా కపూర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa