ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాంఛనంగా ప్రారంభమైన మహేష్-త్రివిక్రమ్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:54 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే.ఈ మూవీకి టెంపరరీ గా SSMB28 అని టైటిల్ పెట్టారు.ఈరోజు ఈ సినిమా లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో   జరగనుంది.ఈరోజు ఉదయం 10 గంటలకు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.మహేష్ బాబు ఈ ఈవెంట్‌ స్కిప్ చేయగా, అతని తరపున అతని భార్య నమ్రతా శిరోద్కర్ హాజరయ్యారు.దర్శకుడు త్రివిక్రమ్  పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి రానుంది.మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా,థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా గురించి ఇతర  వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa