రమేష్ వర్మ డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ,డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి "ఖిలాడి" సినిమాలో నటిస్తున్నారు.ఫిబ్రవరి 11, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది అని నిర్మాతలు ప్రకటించారు.కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 18కి రిలీజ్ చేస్తునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు.తాజా వార్త ఏమిటంటే, OTT ప్లాట్‌ఫారమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.పెన్ మూవీస్ మరియు ఎ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ముఖేష్ రిషి మరియు రావు రమేష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa