ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 04:51 PM

రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.  సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు కనువిందు చేయనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ ఆ జాబితాలో ఉన్నారు. ఐదుగురు హీరోయిన్లు అనగానే సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి అనేది ఏర్పడుతుంది. సుధీర్ వర్మ అనగానే 'స్వామిరారా' సినిమానే గుర్తుకువస్తుంది. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఫస్టు పోస్టర్ తోనే ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ సినిమాలో, మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa