ఈ మధ్య కాలంలో జీ5 లో విడుదల అయిన తమిళ సినిమా "వినోదయ సితం" తెలుగులో రీమేక్ చెయ్యటానికి చూస్తున్నారు. సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం OTTలో మంచి విజయం సాధించింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మూవీ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ తో తీయాలని చూస్తున్నారు. ఒరిజినల్‌లో తంబి రామయ్య పాత్రను సాయి ధరమ్ తేజ్ చేయనున్నారు. అతను ముగ్గురు పిల్లలకు తండ్రిగా కనిపించాడు. ఈ రీమేక్‌లో అతని పాత్ర పూర్తిగా మారిపోతుంది అని మేకర్స్ వెళ్ళడించారు. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌లోకి మార్పులు చేర్పులు చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa