ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటనకు నేను దూరం...ఓ హాస్య నటుడి ట్విట్...ఇది హాస్యామా లేక నిజమా

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 03:45 PM

వ్యక్తుల పాత్రను బట్టి వారు చేసే పనులపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అలాంటిదేనా ఈ  పోస్ట్ అన్న రీతిలో ఇపుడు సరికొత్త చర్చ సాగుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, క‌ల్కి, జాతి ర‌త్నాలు వంటి సినిమాల్లో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. సినిమాల్లో ఎన్నో అవ‌కాశాలు అందుకుంటోన్న ఆయ‌న ఈ స‌మ‌యంలో న‌టన‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు. 2022 త‌న చివ‌రి సంవ‌త్సరం అని, ఆ త‌ర్వాత సినిమాలు చేయ‌న‌ని చెప్పాడు. న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మవుతున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చేసిన పోస్ట్ చూసిన అభిమానులు ఇటువంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కామెడీ చేయ‌డం లేదు క‌దా? అని సెటైర్లు వేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగానే ఇటువంటి ట్వీట్ చేశాడ‌ని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. గతంలోనూ కొంద‌రు న‌టులు ఇలాగే సినిమాల‌కు దూరమ‌వుతామ‌ని అబ‌ద్ధాలు చెప్పార‌ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా, రాహుల్ రామ‌కృష్ణ 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజ‌య్ దేవ‌రకొండ స్నేహితుడిగా అద్భుతంగా న‌టించాడు. అనంతరం పలు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆయ‌న న‌టించిన‌ ఆర్ఆర్ఆర్, విరాటప‌ర్వం సినిమాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa