ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అశోకవనంలో అర్జున కల్యాణం' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 06:14 PM

ఎట్టకేలకు విశ్వక్సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  ఇప్పటి వరకు యూత్ ని, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూనే ఉన్నాడు విశ్వక్సేన్. అతని డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ కూడా అలాంటి కథలకు బాగా సెట్ అయ్యాయి. అయితే ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే 'అశోకవనంలో అర్జున కల్యాణం'.
టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. బాపినీడు - సుధీర్ చంద్ర నిర్మాత. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుండగా.. విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.
  జై క్రిష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వక్సేన్ జంటగా రుక్సార్ థిల్లాన్ అలరించనున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుక్సార్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఆమె కెరీర్‌కి ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa