సీరియల్స్‌కు దేశంలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందులోనూ అధిక ప్రజాదరణ పొందిన సీరియల్స్ అంటే మహిళలకు విపరీతమైన ఆసక్తి. ఇక నాగిని సీరియల్ అంటే బుల్లితెర వీక్షకులకు సుపరిచితమే. ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ నిర్వహణలో సాగే ఈ సీరియల్లో నటించిన వారికి విపరీతమైన పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సీరియల్ 6వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ప్రముఖ బిగ్‌బాస్ బ్యూటీ నటించనుండడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది.
నాగిని సీరియల్ కొత్త సీజన్‌ను ఈ నెల 12న విడుదల చేసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కొత్త సీజన్లో ప్రధాన పాత్రధారిగా హిందీ బిగ్‌బాస్ 15 విన్నర్ తేజస్వి ప్రకాశ్ నటించనుంది. దీనిని ధ్రువీకరిస్తూ కలర్స్ టీవీ తమ ఇన్‌స్టా పేజీలో శనివారం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విడుదల వచ్చిన కొన్ని గంటల్లోనే నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పెద సంఖ్యలో స్వాగతిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అత్యంత పాపులారిటీ ఉన్న ఈ సీరియల్లో తేజస్వి నటన జతకావడం అదనపు ఆకర్షణగా నిర్వాహకులు చెబుతున్నారు. దీనిలో అభిమానులకు ఒక ట్విస్ట్ ఉండనుందట. అదే కరోనా వైరస్ అని ప్రచారం సాగుతోంది. ఇదే సీజన్లో తేజస్వితో పాటు ఆమె బిగ్‌బాస్‌లో ఆమె కో కంటెస్టెంట్ సింబా నాగ్‌పాల్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa