టాలీవుడ్ యువనటుడు అడివి శేష్ నటించిన 'మేజర్' సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. మే 27న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాను శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. మహేష్ బాబు యొక్క జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏప్లస్ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తోంది. ముంబై పేలుళ్లలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa