ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ప్రేమ, పెళ్లిళ్లు నాకు కలిసిరావు" కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 07:50 PM

కరాటే కళ్యాణి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తో కరాటే కల్యాణికి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా.. సమాజంలో జరిగే పలు విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
 తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కళ్యాణి. తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు, తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగంకు గురయ్యారు. ‘భార్య అంటే వంటింటికే పరిమితం. ఏం చెప్తే అది చేయాలి ఎదురు మాట్లాడకూడదు అనుకునేవాళ్లు చాలామందే నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని అరచేతితో ఆపేయలేరు నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో అన్నారు. మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా అని తెలిపారు కళ్యాణి. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా అని అన్నారు. ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, తనకు నిజమైన ప్రేమ దొరకలేదని కల్యాణి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa