ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో తలపతి విజయ్ టీవీఎంఐ పార్టీ పోటీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 09:10 PM

తమిళనాడులో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టాలని విజయ్ మక్కల్ ఇయక్కమ్ (టీవీఎంఐ) నిర్ణయించారు. గతంలో సినీహీరో విజయ్ అభిమానుల సంఘంగా ఉన్న ఈ సంస్థ గతేడాది జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 129 సీట్లు గెలుచుకుంది. తద్వారా విజయవంతంగా రాజకీయ అరంగేట్రం చేశారు.దీనిపై టీవీఎంఐ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల్లో తాము ఏ కూటమిలోనూ చేరబోమని స్పష్టం చేశారు. టివిఎంఐ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని ఎన్నికల ప్రచారంలో సూచించారు.ఎన్నికలో అభ్యర్థులెవరూ అప్పులు చేయవద్దని ఆదేశించారు.ఎన్నికల్లో 12,607 స్థానాలకు గాను 57,778 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల విభాగం వెల్లడించింది. మొత్తం 74,383 నామినేషన్లు రాగా, అందులో 2,062 తిరస్కరణకు గురయ్యాయి. 14,324 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని వివరించారు. 218 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa