ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖిలాడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా వస్తుంది ఎవరు ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 03:29 PM

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ ప్రాజెక్ట్స్ మరియు బిజీ షెడ్యూల్స్ లో ఉన్న హీరో అని చెప్పొచ్చు.యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తునా "ఖిలాడి"  ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది .రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు."ఖిలాడి" ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్ . హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో "ఖిలాడి" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటల  జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ ఈవెంట్‌కు యంగ్ రెబెల్ స్టార్  ప్రభాస్ అతిథి గా వస్తారని సోషల్ మీడియా లో రుమౌర్స్ వచ్చాయి. కానీ ఈ విషయం పైన మూవీ మేకర్స్ ఎమి అనౌన్స్ చేయలేదు .ఏ స్టూడియోస్,పెన్ స్టూడియోస్  నిర్మిస్తున్న ఈ సినిమాకి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa