ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారువారి పాట' నుండి న్యూ అప్డేట్ వచ్చేసింది..

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 05:43 PM

మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం 'సర్కారువారి పాట' ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని చక చకా అప్ డేట్స్ వదున్నుతున్నారు. అయితే తాజాగా  
వాలంటైన్స్ డే  సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘కళావతి’ పాటకు సంబంధించిన పోస్టర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. పోస్టర్ చూస్తుంటే ఈ పాటలో కీర్తి సురేష్ అందాలను ఆరబోయడంలో మెప్పించబోతోందని తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన ఈ పాట ఇక  ఎంతమంది హృదయాలను హత్తుకుంటుందో చూడాలి. మైత్రీ - 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa