కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.25 కోట్లకు సేల్ అయ్యింది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. OTT ప్లాట్‌ఫారమ్, SonyLIV డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోగా , లహరి మ్యూజిక్ ఆడియో రైట్స్ ని పొందింది.లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ,ఈరోజు సాయంత్రం 5:49 గంటలకు "ఆడవాళ్లు మీకు జోహార్లు" టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు.ఈ విషయాన్ని మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ఆఫిసిఅల్ గా అనౌన్స్ చేసారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa