ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన ఖిలాడి సినిమా దర్శకుడు

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 04:51 PM

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖిలాడి. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ఒకేరోజు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేయడం కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా ‘ఖిలాడి’ సినిమా దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ ఖిలాడి సినిమాలో హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరికి క్షమాపణలు చెప్పారు. ఖిలాడీ ట్రైలర్‌ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్‌ హాయాతినే చిత్ర బృందం కాస్త ఎక్కువ గా చూపించారు. ఆ విషయంలో ఐయామ్‌ ఎక్స్‌ట్రీమ్లీ సారీ మూవీ చూశాక నువ్వు చాలా సంతోషిస్తావు మూవీలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది అని దర్శకుడు రమేష్ వర్మ పేర్కొన్నాడు. దర్శకుడు రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్‌ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది. ఇప్పటికే ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న మీనాక్షి చౌదరి ‘ఖిలాడి’ సినిమాతో బాక్స్ ఆఫీసు దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa