అజిత్ వలిమై సంక్రాంతికి విడుదలకావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది అయితే ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలవుతోంది. తాజగా ఈ సినిమాను ట్రైలర్‌ను మహేష్ బాబు విడుదల చేశారు.అయితే కరోనాతో పాటు తమిళనాడులో థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అప్పటిలో అధికారిక ప్రకటన చేసింది టీమ్.ప్రస్తుతం కరోనా కేసులు కాస్తా తగ్గడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 24వ తేదీన మలయాళం తప్పించి మిగతా నాలుగు భాషల్లో ‘వలీమై’ విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ ప్రకటన చేయడంతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు.
దీంతో అజిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు హీరో కార్తికేయ కూడా తన లుక్‌తో అదరగొట్టారు. ఇక అజిత్ లుక్ కేకపెట్టించే విధంగా ఉంది. దారి దోపిడీలు చేసే ఓ గ్యాంగ్‌ను పట్టుకునే పోలీస్ అధికారి పాత్రలో అజిత్ కుమార్ నటించారు. మొత్తంగా బైక్ ఛేజింగ్ సీనులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ ట్రైలర్స్‌ను కూడా విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa