ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతున్న కామెంట్లపై సినీ నటి అర్చన పెదవి విప్పారు. అదేంటంటే ఆమె పెళ్ళైన తర్వాత లావు అయ్యారని ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై స్పందించిన ఆమె, అసలు అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించారు.అసలు ఆ ప్రశ్నే తప్పు అని ఆమె తెలిపారు. ఆ ప్రశ్నపై తాను అసలు ఎందుకు వివరణ ఎందుకు ఇచ్చుకోవాలి అని ఆమె అన్నారు. ఆ ట్రోల్స్ ఏంటో తానైతే చూడలేదన్న అర్చన, అసలు ఆ స్టుపిడ్ క్వశ్చన్స్ ఎందుకు వేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతకు ముందు లాగానే వర్క్ చేస్తూ ఉన్నానని, ఈ కరోనా లాక్ డౌన్ రావడం వల్ల కొంచెం ఖాళీగా ఉన్నానని ఆమె చెప్పారు.
అంతే గానీ దానికి ఇలా ట్రోల్స్ చేయడం ఏంటని ఆమె అన్నారు. ఇకపోతే తన మారేజ్ లైఫ్ చాలా బావుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అందరూ అంటున్నారుగా తాను లావు అయ్యానని, అది కూడా తనకు హ్యాపీగానే అనిపిస్తుందని ఆమె చెప్పారు. తన వివాహ జీవితం ఒక పాజిటివ్ చేంజ్ ని తీసుకొచ్చిందని అర్చన వివరించారు.
కాగా అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రంలో ప్రత్యేకంగా తన పాత్రకు చాలా మంచి స్కోప్ ఉందని, సెకండ్ హాఫ్ నుంచి మంచి పర్ఫామెన్స్ సీన్స్ ఉన్నాయని అర్చన తెలిపారు. కాబట్టి ఈ సినిమా విడుదల కోసం తాను చాలా ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా అందరూ చూడాలని ఆమె అన్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేయాలా, థియేటర్లో రిలీజ్ చేయాలా అన్నది డైరెక్టర్ చేతుల్లో ఉంటుందని ఆమె చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa