హర్ష్ కనుమిల్లి మరియు సిమ్రాన్ చౌదరి నటించిన "సెహరి" సినిమా ఫిబ్రవరి 11, 2022న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వస్తునా ఈ సినిమా కి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు.ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.హర్ష కనుమిల్లి రచించిన ఈ సినిమాలో నందు, అభినవ్ గోమతం మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసింది, CBFC ద్వారా U/A ను పొందింది.రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో హీరో హర్ష్ మాట్లాడుతూ సినిమా ఫీల్డ్ లోకి రావడం అంత ఈజీ కాదన్నారు.ఈ ఫీల్డ్ లో ఎదగాలి అంటే కష్టపడాలి అని అన్నారు . ఈ ప్రాజెక్ట్‌కి హెల్ప్ చేసిన నందమూరి బాలకృష్ణ కోసం ప్రివ్యూ షో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని హర్ష వెల్లడి చేసారు .బాలయ్య అవుట్ అఫ్ స్టేషన్ లో ఉండడం వల్ల ఈ సినిమా ని బాలకృష్ణ గారు చూడలేదు.డాక్టర్ రాజశేఖర్ గారు ఈ సినిమా ని చూసి మెచ్చుకున్నారు .యూత్ అందరికి రెలీటెడ్ గా ఉంది కాబట్టి ఈ మూవీ ని సినిమా లవర్స్ అండ్ ఆడియన్స్ తప్పకుండ సక్సెస్ చేస్తారు అని వెల్లడించారు. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ అందించాగా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa