సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన" గంగూబాయి కతియావాడి" ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎదురుచూసిన హిందీ సినిమాలలో ఒకటి అని చెప్పొచ్చు.బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సీమా పహ్వా, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, ఇందిరా తివారీ, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ , హుమా ఖురేషి అతిధి పాత్రలలో కనిపించనున్నారు .ఫిబ్రవరి 25, 2022న "గంగూబాయి కతియావాడి" ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈరోజు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఈ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా మరియు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa