ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ డేట్ ని లాక్ చేసిన అక్షయ్ కుమార్ "పృథ్వీరాజ్"

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 11:35 AM

కోవిడ్-19 కారణంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమా రిలీజ్ పోస్టుపోన్ చేస్తూ వచ్చారు.ఇప్పుడు తాజాగా,ఈ మూవీ రిలీజ్ డేట్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో  హిస్టారికల్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 10న రిలీజ్ చేస్తున్నట్లు స్టార్ హీరో   గురువారం ప్రకటించారు. ఈ సినిమా లో మానుషి చిల్లర్, సంజయ్ దత్ , సోనూ సూద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ,అక్షయ్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఆ పోస్టర్ లో అక్షయ్   కత్తి , డాలు పట్టుకుని కనిపించాడు.ఈ సినిమా తో  2017 మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది."పృథ్వీరాజ్" సినిమా  గ్లోబల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది అని సమాచారం .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa