పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు. "భీమ్లా నాయక్" మలయాళ సినిమా "అయ్యప్పనుమ్ కోషియుమ్"కి రీమేక్ అని అందరికి తెలిసిన సంగతే .సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా దగ్గుబాటి భార్య పాత్రలో మలయాళ నటి సంయుక్తా మీనన్ నటిస్తోంది.ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను ముందుగా జనవరి 11న విడుదల చేయాలని అనుకోగా కోవిడ్ కారణం గా వాయిదా వేసారు.గతం లో "భీమ్లా నాయక్" ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న విడుదల కానుంది అని మేకర్స్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసారు .ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం.రిలీజ్ డేట్ కి సంబందించిన డేట్ ని మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. తాజాగా ఇప్పుడు ,మాగ్నమ్ ఓపస్" భీమ్లా నాయక్" టాప్ బుకింగ్ సైట్ బుక్ మై షోలో 90 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa