తమిళ నటుడు శివకార్తికేయన్ నటించిన రెమో, వరుణ్ డాక్టర్ సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి హిట్స్ గా నిలిచాయి. దీంతో ఆయన తన 20వ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా చేస్తున్నారు. జాతిరత్నాలు సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. శివ కార్తికేయన్ కెరీర్ లో 20వ సినిమా ఇది. గురువారం పూజ చేసి సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలియజేసారు. ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో షూట్ చేయనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.