ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డేటింగ్ లో ఉన్న మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 12:21 PM

సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ లో మంజిమా మోహన్ తన టాలెంట్ తో మంచి పేరు సంపాదించుకుంది. మలయాళం, తమిళ సినిమాలలో ఎక్కువగా   కనిపిస్తుంది. ఆమె మలయాళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది . " ఒరు వడక్కన్ సెల్ఫీ" , " అచ్చం ఎన్బదు మడమైయద" సినిమాలతో మలయాళం,తమిళం లో నటిగా రంగప్రవేశం చేసింది."సాహసం శ్వాసగా సాగిపో" సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ మూవీ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆమె కథానాయకుడు,  మహానాయకుడు  సినిమాలలో కూడా నటించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,మంజిమా మోహన్ గౌతమ్ కార్తీక్‌తో డేటింగ్ అని  వారు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో రిలీజ్ అయినా  "దేవరత్తం" సినిమాలో ఈ లవర్ బర్డ్స్ వర్క్ చేసారు.మరికొద్ది నెలల్లో తమ పెళ్లిని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.ఈ 2022  ఏప్రిల్ లో పెళ్లి చేసుకుంటున్నట్టు సమాచారం కానీ ఈ న్యూస్  పై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa