''జేమ్స్' రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం అని పునీత్ రాజ్ కుమార్ ను ఉద్దేశించి హీరో ప్రభాస్ భావోద్వేగ ట్విట్ చేశారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల కాబోతోంది. మార్చ్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను నిన్న విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''జేమ్స్' రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్' అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్రం మార్చి 11న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa