ఇంటర్వ్యూలో తన బాల్యం, సినీ కెరీర్ విశేషాల గురించి అభిమానులతో పంచుకుంది. చిన్న చిన్న సమస్యలకే భయపడి చనిపోవాలనుకునేదాన్నని, ఓసారి ఏకంగా ట్రైన్లో నుంచి దూకేయాలనిపించిందని తెలిపింది. ఈ ప్రపంచంలో ఎవరైనా 15 20 ఏళ్ల వయసులో చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ కలిగివుంటారు. ఎందుకంటే ఆ స్టేజ్ లో వాళ్లు ఏం కోరుకుంటారో.. దానికోసమే తపన పడుతుం టారు. ఆ టైమ్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో పాటు జీవితంలో సరైన నిర్ణయంతీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేక సూసైడికల్ థాట్స్ పుట్టుకొస్తుంటాయి. నేను లోకల్ టెన్లో స్కూల్‌కు వెళ్తున్నప్పుడు అందులో నుంచి దూకితే ఎలా ఉంటుందనే ఆలోచనలు వచ్చేవి' అంటూ వివరించింది. ఇక పేరెంతనను డెంటిస్ట్ చేసేందుకు కలలు కన్నారని,కానీ అందుకు విరుద్ధంగా మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివి సినిమా రంగంలోకి వచ్చానంటూ చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa