ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి పీటలెక్కనున్న కోలీవుడ్ హీరోయిన్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 04:27 PM

కోలీవుడ్ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. దీనికి సినీ వర్గాల నుంచి సైతం అవుననే సమాధానం వస్తోంది. అయితే ఆయన పెళ్లాడేది ప్రముఖ హీరోయిన్ మంజిమా మోహన్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో దేవరత్తమ్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, పెద్దల అనుమతితో త్వరలో ఒక్కటి కాబోతున్నట్లు కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 2019 నుంచి ఈ యువ జంట అప్పటినుంచి వాళ్లిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పెద్దల అనుమతి కోసం నిరీక్షించిన వారికి గ్రీన్ సిగ్నల్ ఇటీవలే వచ్చిందట. దీంతో పెళ్లికి సిద్ధమయ్యారని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వాలంటైన్స్‌ డే సందర్భంగా తమ ప్రేమను, పెళ్లి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కొట్టిపారేయలేమని పేర్కొంటున్నారు. ఒకప్పటి తమిళ హీరో నవరస నయగన్‌ కార్తీక్‌ కొడుకే గౌతమ్‌ కార్తీక్‌. ప్రస్తుతం అతడు యుత సతం, పాటు తల సినిమాలు చేస్తున్నాడు. మంజిమ మోహన్‌ తెలుగు ప్రేక్షకులకు 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా సుపరిచితమే. ప్రస్తుతం ఆమె నటించిన ఎఫ్‌ఐఆర్‌ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో విష్ణు విశాల్‌, రైజా విల్సన్‌, రెబా మోనికా, గౌతమ్ మీనన్ తదితరులు నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa