బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. లోన్ ఎగ్గొట్టిన కేసులో ముంబై కోర్టు శిల్పాశెట్టి కుటుంబానికి సమన్లు జారీ చేసింది. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి, తల్లికి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. రూ.21 లక్షల రుణం ఎగ్గొట్టినట్లు ఓ వ్యాపారవేత్త శిల్పాశెట్టి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa