ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 10:10 AM

తమిళ హీరో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ అందాల బామ మరియా ర్యాబోశాప్క నటించనుంది. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కలయికలో కొత్త చిత్రం తీస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటే శ్వర సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే ఎస్ఎస్ తమన్ చిత్రానికి సంగీతం అందిచనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ యూకే నేపథ్య స్టోరీతో తీస్తున్నారు. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికార ప్రకటన చిత్ర బృందం ప్రకటించ నుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ దక్షిణాది యువకుడు విదేశీ అమ్మాయి మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది. అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa