ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హరి హర వీర మల్లు" షూటింగ్ కి డేట్స్ ఇచ్చిన పవన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 12:00 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన "భీమ్లా నాయక్" సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం పవన్ తన రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన క్రిష్ దర్శకత్వం వహిస్తున "హరి హర వీర మల్లు" సినిమా పై ఫోకస్ చేస్తున్నాడు.ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో  భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది.ఈ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్లు,మార్చి 18 నుంచి "హరి హర వీర మల్లు" సినిమా సెట్స్‌లో పవన్ జాయిన్  అవుతున్నడని మేకర్స్ వెల్లడించారు.సెట్స్‌పైకి రాగానే ఈ సినిమాని  షూటింగ్‌ను త్వరగ  పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు.ఇప్పటికే  "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ 50% పూర్తయింది అని సమాచారం.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa