పొలిటికల్ థ్రిల్లర్ ట్రాక్ లో శంకర్ డైరెక్షన్ లో RC15 సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయం.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి తాత్కాలికంగా RC15 అని టైటిల్ పెట్టారు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.RC15 సినిమాలో ఒక లుక్‌లో రామ్ చరణ్ బ్యూరోక్రాట్‌గా కనిపిస్తారని, మరో లుక్‌లో నార్మల్ మాన్ లాగ కనిపించనున్నారు అని సమాచారం. 2023 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలనీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .ఈ సినిమాలో విలన్ గా SJ సూర్యను మేకర్స్ సెలెక్ట్ చేసారని సమాచారం.ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ నటించిన సినిమాలో ఎస్ జె సూర్య తెలుగులో లాస్ట్ గా విలన్ గా కనిపించారు.శ్రీకాంత్, సునీల్, అంజలి, జయరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా ,ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది అని వెల్లడించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa