హరిహర వీరమల్లు చిత్ర నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆ సినిమా యూనిట్ నిర్ణయించింది. పవన్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భీమ్లా నాయక్' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా ఆయన 'హరి హర వీరమల్లు' సినిమాను చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం వలన .. 'భీమ్లా నాయక్'ను ముందుగా పూర్తి చేద్దామని పవన్ అనుకోవడం వలన, 'వీరమల్లు' షూటింగు కొంతకాలంగా ఆపడం జరిగింది. ఈ లోగా మరిన్ని భారీ సెట్లను కూడా క్రిష్ దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. ఇక వచ్చేనెల నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టే ఆలోచన చేశారని అంటున్నారు. మార్చి 18వ తేదీ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఇక ఈ సారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చకచకా మిగతా 50 శాతం చిత్రీకరణను జరిపేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా అందాల సందడి చేయనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో అర్జున్ రాంపాల్ .. ఆదిత్య మీనన్ .. శుభలేఖ సుధాకర్ కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa