ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ OTT కంటెస్టెంట్స్ లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 11:42 AM

టాలీవుడ్ మన్మధుడు ,కింగ్ నాగార్జున బిగ్‌బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.బిగ్‌బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ రోజు ఇంకా 2 నెలలలో మళ్లీ వస్తాను కానీ వేరే ఫార్మాట్‌లో వస్తాను అని చెప్పారు.చెప్పినట్లుగానే నాగ్ ఈ నెలలో బిగ్ బాస్ వేదికపైకి తిరిగి వస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు OTT తొలి సీజన్ ఫిబ్రవరి 26న ప్రీమియర్‌గా విడుదల కానుంది.డిస్నీ+హాట్‌స్టార్ బిగ్‌బాస్ షోను 24*7 ప్రసారం చేస్తుంది. ఈ ఫార్మాట్‌లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ OTT పాత మరియు కొత్త హౌస్‌మేట్‌ కుడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.ఆదర్శ్ బాలకృష్ణ, మహేష్ విట్టా, అరియానా, సరయు, ఆశు రెడ్డి, అఖిల్, నటరాజ్ మాస్టర్ , తేజస్విని,యంగ్ హీరో అర్జున్, యాంకర్ శివ, యాంకర్ స్రవంతి  24/7 లైవ్ షోలో కంటెస్టెంట్స్ గా  చేరనున్నారు అని సమాచారం . ఇది OTT ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ప్రసారం చేయబడుతుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa