ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న యువ హీరో?

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 11:46 AM

కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కడలి సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ యువ నటుడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో మలయాళీ నటి మంజిమా మోహన్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారట. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. నాగచైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో తెలుగు తెరకు మంజిమా మోహన్ కథానాయికగా పరిచయమైంది. 2019లో గౌతమ్ హీరోగా తెరకెక్కిన 'దేవరాట్టం' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa