తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. ఆయనకి గతంతో పోలిస్తే తెలుగులో సినిమా అవకాశాలు బాగానే తగ్గిపోయాయి. ఇక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ప్రకాష్ రాజ్ ఒక్కరిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చిత్ర పరిశ్రమలో పోటీ సాధారణం అని కొందరు ఆ పోటీని పాజిటివ్‌గా తీసుకుంటారని.. మరి కొందరు తీసుకోరని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అంతేకాదు.. సినీ రంగంలో ఈర్ష్యలు కూడా చూశానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇక ఈర్ష్యను నేను పర్సనల్ గా తీసుకోనని ఆయన అన్నారు. అంతేకాక.. చిత్ర పరిశ్రమలోకి వచ్చేసరికి హిస్టారికల్ సినిమాలు ఆగిపోయాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. కాగా.. రాజమౌళి సినిమాలకు తాను ఎక్కువగా అవసరం పడలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుతం సెల్ ఫోన్‌లో కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అంతేకాదు.. హీరోగా సినిమా ఆఫర్లు వచ్చినా ఆ సినిమాలలోని హీరో రోల్‌ను కూడా తాను పాత్రగా చూస్తానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇక తారక్, రామ్ చరణ్, మహేష్ డ్యాన్స్ చేస్తారని యాక్షన్ హీరోలే బాగా చేస్తారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అయితే ముఖ్య కథా పాత్రలలో నటించడానికి తాను ఆసక్తి చూపిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ ముక్కుసూటిగా ఉండటం వల్ల కొన్నిసార్లు బ్యాన్ చేశారని.. అయితే సమస్యలను పరిష్కరించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్రతి మనిషికి బలం వల్ల, బలహీనతల వల్ల గుర్తింపు ఉండాలని ఆయన తెలిపారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa