ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైట్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ శారీలో పూర్ణ

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 12:53 PM

మలయాళ కుట్టి పూర్ణ  గ్లామర్ కి చిరునామాగా మారిపోయారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఈ అఖండ  బ్యూటీని మిలియన్స్ లో ఫాలో అవుతుండగా... వాళ్ళ దాహాన్ని తన అందాలతో తీర్చేస్తున్నారు.  లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు. ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. పూర్ణతో పాటు సుడిగాలి సుధీర్, యాంకర్స్ రష్మీ , దీపికా పిల్లిని కూడా తప్పించడం విశేషం. వీరందరి నిష్క్రమణతో షోలో కొంచెం ఊపు తగ్గింది.ఇక నటిగా వచ్చ్హిన అవకాశం కాదనకుండా చేస్తున్నారు పూర్ణ. ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.    ఓటిటి రిలీజ్ 3 రోజెస్  తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు.  సీనియర్ స్టార్స్ చిత్రాలలో కీలక రోల్ చేస్తున్నారు పూర్ణ. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ లాయర్ రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ  లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషం అని చెప్పాలి. అఖండ భారీ విజయం సాధించింది. 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.  సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఫ్యాన్ బేస్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఈ హాట్ బాంబ్ పంచుకునే ఫోటోలు, చేసే ఫోటో షూట్స్ పిచ్చ వైరల్ అవుతూ ఉంటాయి. వైట్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ శారీలో ఆమె మెరిశారు. పూర్ణ గ్లామరస్ ఫోటోలు పిచ్చ వైరల్ అవుతున్నాయి.





 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa