ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"భీమ్లా నాయక్" ప్రమోషనల్ సాంగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 16, 2022, 01:02 PM

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మరియు బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.పవర్‌స్టార్ ఫాన్స్ ఈ సినిమా  కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు . పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఫిబ్రవరి 25, 2022నవరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయటానికి మూవీ మేకర్స్ ఒక  పోస్టర్ ని రిలీజ్  చేసారు.త్వరలోనే ఈ సినిమా సెన్సార్‌కి అప్లై చేయనుంది అని మేకర్స్ వెల్లడించారు.ఇప్పుడు,  అతి త్వరలో ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు  మేకర్స్ వెల్లడించారు .ఈ పాటలో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరూ కనిపించనున్నారు.మేకర్స్ చెప్పినట్లుగానే  తమన్-మార్క్ ఎనర్జిటిక్ కంపోజిషన్ ఉంటుంది అని  ఫాన్స్ అండ్ సినిమా లవర్స్ భావిస్తున్నారు."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు  థమన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa