మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన "గని " మూవీ నుంచి మూవీ మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ ని రిలీజ్ చేసారు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.ఫిబ్రవరి 25, 2022 న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అవ్వగా , ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 25న రానుందని ఈరోజు మేకర్స్ ప్రకటించారు."గని " సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసి, CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది . ఈ సినిమా రన్‌టైమ్ 151 నిమిషాల ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ."భీమ్లా నాయక్ "టీమ్ కూడా ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు.మరి "గని " టీమ్ ఈ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తారో లేక పోస్టుపోన్ చేస్తారో చుడాలిసిందే.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa