సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. అతని సినిమాలతోనే కాక, అతని ట్వీట్స్ తో, అతని మాటలతో కూడా వైరల్ అవుతూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. ఇక అమ్మాయిల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు.ఎంతమందిలో ఉన్నా సరే అమ్మాయిని పొగడాలి అనుకుంటే నిర్మొహమాటంగా పొగిడేస్తారు. ఇలా చాలా సార్లు పబ్లిక్ గానే హీరోయిన్స్ ని, యాంకర్స్ ని పొగుడుతూ, వారి అందం పై కామెంట్స్ చేస్తారు ఆర్జీవీ. తాజాగా మరో యాంకర్ ని కూడా తన స్టైల్ లో కామెంట్ చేశారు.
‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి గా నెగెటివ్ రోల్ కనిపించిన కన్నడ హీరో ధనుంజయ్ తన ‘బడవ రాస్కెల్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. తాజాగా మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆర్జీవీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ ని యాంకర్ శ్యామల హోస్ట్ చేసింది. దీంతో ఆర్జీవీ ఈ ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న యాంకర్ శ్యామలపై కామెంట్స్ చేశారు.
ఆర్జీవీ మైక్ తీసుకోగానే యాంకర్ శ్యామలని ఉద్దేశించి.. ”అసలు ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు” అంటూ కామెంట్ చేశారు. దీంతో శ్యామల ఆశ్చర్యపోయింది. అలాగే యాంకర్ శ్యామల ఆర్జీవీ వచ్చినప్పుడు తోపు, రౌడీ, గుండా.. అనే పడాలని వాడుతూ పొగిడింది. దానికి కూడా ఆర్జీవీ సమాధానమిస్తూ.. ”నువ్వు నన్ను తోపు, రౌడీ ఇలా అన్నావు వాటితో పాటు నేను రాస్కెల్ కూడా” అంటూ తనపైనే సెటైర్ వేసుకున్నారు ఆర్జీవీ. దీంతో యాంకర్ శ్యామలపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa