ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"భీమ్లా నాయక్ " తో తలపడటానికి సిద్ధంగా ఉన్న "ఆడవాళ్లు మీకు జోహార్లు"

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 12:26 PM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా, కన్నడ బ్యూటీ రష్మిక "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా  పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.శర్వానంద్  అండ్  రష్మిక ఇద్దరూ  సినిమా  డబ్బింగ్ సెషన్‌లను పూర్తి చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసారు .పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" ఫిబ్రవరి 25, 2022న  రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా,శర్వా మూవీ పోస్టుపోన్ అవుతుంది అని  నెటిజన్లు భావించారు.కానీ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా  ముందుగా అనౌన్స్ చేసిన డేట్ నే రిలీజ్  కానుందని AMJ మేకర్స్ ప్రకటించారు.ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి  ఈ సినిమాని నిర్మిస్తున్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa