కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.25 కోట్లకు సేల్ అయ్యింది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ మూవీ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.ఫిబ్రవరి 19న ఈ ట్రైలర్ ని లాంచ్ చేయటానికి మేకర్స్ డిసైడ్ అయ్యారు .సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa